Anubhuti యాప్‌ని ఉపయోగిస్తూ మీ జాన్ డియర్ ట్రాక్టర్‌తో సౌకర్యవంతంగా అలాగే సమర్ధవంతంగా పనిచేసుకోండి

వ్యవసాయంలో సాంకేతికతని  నిరంతరంగా అనుసంధానించడం వలన రైతులకు అనేక రకాలుగా సహాయపడుతుంది  - స్థిరమైన వృద్ధిని మరియు పెరిగిన ఉత్పాదకతను అందించడం అవసరం. ఆధునిక రైతు మరియు వ్యవసాయ నిపుణుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన అనేక ఫీచర్లు మరియు ప్రయోజనాలను అందించే Anubhuti యాప్‌ సాంకేతికత వ్యవసాయాన్ని ఎలా అభివృద్ధి చేస్తుందో చెప్పడానికి ఒక ప్రధాన ఉదాహరణ.

భారతదేశం అంతటా వ్యవసాయ సముదాయాల ఉన్నతికి వ్యవసాయం మరియు సాంకేతికత మధ్య సమన్వయాన్ని ఇది ఎలా ఉదహరిస్తుందో చూపించే Anubhuti యాప్‌ ప్రత్యేకతలు మరియు ప్రయోజనాలను చూద్దాం.

Anubhuti యాప్: వ్యవసాయంలో మీకు తోడు!

Anubhuti ప్రధానంగా నిరంతరమైన మరియు సహజమైన వినియోగదారు అనుభవాన్ని అందిస్తుంది. మీరు జాన్ డియర్ వారి కస్టమర్ అయినా లేదా మీ వ్యవసాయ ప్రయాణాన్ని ఇప్పుడే ప్రారంభించినా, ఈ యాప్ యొక్క సులభమైన సైన్-అప్ ప్రక్రియ మీరు వేగంగా ఆన్‌బోర్డ్ అయ్యేలా చూస్తుంది.

మీ ఉపకరణాన్ని ఎలాంటి శ్రమ లేకుండా నమోదు చేసుకోండి మరియు వారంటీ కవరేజ్‌తో సహా అనేక లాభాలు పొందండి, ఇంకా నేరుగా మీ ఇంటి వద్దకే పార్ట్స్ డెలివరీ  అందుకోండి.

Anubhuti యాప్‌లో ప్రత్యేకతలు

మీరు మీ వ్యవసాయ పరికరాలను త్వరగా మరియు ఖచ్చితంగా నిర్వహించుకునేలా చేసే అనేక ప్రత్యేకతలను Anubhuti యాప్ అందిస్తుంది.

అదనపు ప్రత్యేకతలు ఇక్కడ ఉన్నాయి:

1. బహుభాషా ఇంటర్ఫేస్

Anubhuti యాప్ యొక్క ప్రత్యేక లక్షణాలలో ఒకటి దాని బహుభాషా ఇంటర్‌ఫేస్, 9 కంటే ఎక్కువ ప్రాంతీయ భాషలకు మద్దతును అందిస్తోంది. ఇది మీరు ఎంచుకున్న భాషలో ఉత్పత్తులు మరియు సేవలను మీరు శ్రమ లేకుండా బ్రౌజ్ చేసేలా చూస్తుంది, సుపరిచిత భావన మరియు నావిగేషన్ సౌలభ్యాలను అందిస్తుంది

2. పరికర నిర్వహణ మరియు మెయింటెనెన్స్

Anubhuti యాప్‌తో, మీరు మీ జాన్ డియర్ పరికర నిర్వహణ మరియు మెయింటెనెన్స్ మీద సంపూర్ణ నియంత్రణను కలిగి ఉంటారు. సమగ్ర మెయింటెనెన్స్ షెడ్యూల్స్ మరియు సర్వీస్ హిస్టరీకి ప్రాప్యతను అందించే ఈ యాప్ మీ పరికరం మెయింటెనెన్స్‌ను సమర్ధవంతంగా మరియు సంపూర్ణంగా ప్రణాళిక చేసుకోవటానికి వీలు కల్పిస్తుంది. క్రమం తప్పకుండా మెయింటెనెన్స్ చేసుకోవటం ద్వారా, మీ మెషీన్ల జీవితకాలం మీరు పెంచుకోవచ్చు మరియు పాడైపోవడం వలన కలిగే నష్టాలను నివారించుకోవచ్చు.

3. జాన్ డియర్ డీలర్ నెట్‌వర్క్‌తో కనెక్ట్ అవ్వండి

Anubhuti యాప్‌లో "లొకేట్ డీలర్" పైన క్లిక్ చేయటం ద్వారా భారతదేశ వ్యాప్తంగా జాన్ డియర్  డీలర్‌షిప్ వివరాలను సులభంగా తెలుసుకోవచ్చు. మీకు నూతన ఉపకరణాలు, అసలైన భాగాలు, లేదా నిపుణుల సలహాలు ఏది కావాలనుకున్నా, మీకు అందించడానికి మా డీలర్లు సిద్ధంగా ఉంటారు.

జాన్ డియర్  ట్రాక్టర్లలో అత్యంత నిపుణులైన మరియు శిక్షణ పొందిన స్థానిక మెకానిక్స్ కోసం శ్రమలేకుండా శోధించగలిగే ఫీచర్‌  కూడా ఈ యాప్ లో ఉంది. గరిష్ఠ పనితీరు మరియు డౌన్ టైమ్ తగ్గించేలా చూడటానికి, మీరు కేవలం "లోకల్ మెకానిక్స్" బటన్ మీద నొక్కండి మరియు ఈ ప్రత్యేకత ప్రయోజనాన్ని పొందండి.

4. పార్ట్స్ కోసం ఆర్డర్ చేయటం

కేటలాగ్స్ ద్వారా వెతుక్కునే లేదా కస్టమర్ సర్వీస్ కోసం నిరీక్షించే రోజులు పోయాయి. Anubhuti యాప్ మీ
జాన్ డియర్ ట్రాక్టర్  కోసం  పార్ట్స్ ఆర్డర్ చేయడాన్ని సులభం చేస్తుంది. మీ మొబైల్‌లో కేవలం కొన్ని ట్యాప్‌లతో, మీరు అసలైన జాన్ డియర్ భాగాల విస్తృతమైన ఇన్వెంటరీని బ్రౌజ్ చేయవచ్చు, అందుబాటులో ఉన్నాయో లేదో తనిఖీ చేసి  సులభంగా  ఆర్డర్ చేయవచ్చు.

ఈ యాప్ వివరణాత్మక ఉత్పత్తి సమాచారం మరియు అనుకూలతను కూడా అందిస్తుంది, మీరు మీ నిర్దిష్ట పరికరాల కోసం సరైన పార్ట్స్ ఎంచుకునేలా చూస్తుంది. ఇది అంచనాలను తొలగిస్తుంది మరియు దోషపూరిత లేదా అనుకూలంగా లేని పార్ట్స్ ఆర్డర్ చేసే అవకాశాలను తగ్గిస్తుంది.

5. శ్రమరహిత సర్వీస్ అభ్యర్థనలు

సర్వీస్ మరియు రిపేర్ కోసం Anubhuti యాప్ యొక్క సహజమైన ఇంటర్‌ఫేస్‌తో గజిబిజిగా ఉండే సర్వీస్ బుకింగ్ విధానాలకు వీడ్కోలు చెప్పండి. ఛాసి నంబర్ రిజిస్ట్రేషన్‌ను ఉపయోగించుకోవడం ద్వారా, కస్టమర్‌లు సర్వీస్ అపాయింట్‌మెంట్‌లను సజావుగా షెడ్యూల్ చేయవచ్చు, నిర్వహణ అభ్యర్థనలను ట్రాక్ చేయవచ్చు మరియు సకాలంలో అప్‌డేట్‌లనుపొందవచ్చు, డౌన్ టైమ్ తగ్గించవచ్చు మరియు ఉత్పాదకతను పెంచుకోవచ్చు.

6. ఇంప్లిమెంట్ సెలక్టర్ మరియు సర్వీస్ కిట్ లభ్యత

ఈ యాప్ ఇంప్లిమెంట్ సెలక్టర్ ఫీచర్ను అందిస్తుంది, ఇది వినియోగదారుని అనుభవాన్ని మరింతపెంచుతుంది . ఈ ఫీచర్ కస్టమర్‌లు తమ యంత్రాలకు అనుకూలమైన ఇంప్లిమెంట్స్ ని సులభంగా బ్రౌజ్ చేయడానికి మరియు ఎంచుకోవడానికి వీలు కల్పిస్తుంది. అదనంగా, నమోదిత వినియోగదారులు సర్వీస్ కిట్ లభ్యత మరియు ఆర్డరింగ్ ఫంక్షనాలిటీలకు యాక్సెస్ పొందుతారు, నిర్వహణ ప్రక్రియలను క్రమంగా కొనసాగిస్తూ పరికరాల జీవితకాలాన్నిపెంచుతుంది.

7. తాజా వార్తలు మరియు ప్రకటనల సమాచారాన్ని తెలుసుకుంటూ ఉండండి

Anubhuti యాప్‌తో సమగ్రం చేసిన వార్తలు మరియు ప్రకటనల వ్యవస్థతో మీరు ఎన్నడూ ముఖ్యమైన అప్డేట్లను మరియు ప్రకటనలను మిస్ కారు. జాన్ డియర్  ఇండియా ఆఫర్‌లతో తాజా పరిణామాలు, ఉత్పత్తి లాంచ్ మరియు పరిశ్రమ అంతర్దృష్టుల గురించి తెలుసుకోవటం ద్వారా అవగాహనపూర్వక నిర్ణయాలుతీసుకుంటూ ,చురుకుగా పాల్గొనండి.

8. సమగ్ర వనరుల భాండాగారం

మెరుగైన వినియోగం మరియు ప్రాప్యత కోసం, యాప్ -ఛాసిస్ నంబర్ రిజిస్ట్రేషన్‌ తరువాత   కస్టమర్‌ల నిర్ధిష్ట మెషినరీ కి  ఆపరేటర్ మాన్యువల్‌లకు యాక్సెస్‌ను అందిస్తుంది. అదనంగా, వినియోగదారులు  జాన్ డియర్ ఫైనాన్స్-సంబంధిత సమాచారాన్ని లోతుగా పరిశోధించవచ్చు, వారి అన్ని పరికరాల సంబంధిత ప్రశ్నలు మరియు అవసరాల కోసం యాప్‌ను సమగ్ర వనరుల రిపోజిటరీగా ఉపయోగించుకోవచ్చు.

9. మెరుగైన ట్రాక్టర్ 3D అనుభవం

డీలర్‌షిప్ అనుభవాన్ని పునర్నిర్వచిస్తూ, Anubhuti యాప్ ఆకర్షణీయమైన ట్రాక్టర్ 3డి ఫీచర్ అందిస్తుంది, వినియోగదారులకు వర్చవల్ డీలర్‌షిప్ అనుభవం మరియు అనుబంధ వాస్తవికత త్వరిత లింకులను అందిస్తుంది. ఈ లీనమయ్యే ఇంటర్‌ఫేస్ కస్టమర్‌లు జాన్ డియర్  వారి ఉత్పత్తి లైనప్‌ను దృశ్యమానంగా, ఆకర్షణీయంగా అన్వేషించడానికి అనుమతిస్తుంది, లోతైన నిమగ్నత మరియు మంచి  నిర్ణయాలు తీసుకోవడాన్ని ప్రోత్సహిస్తుంది.

జాన్ డియర్ Anubhuti యాప్ ఉపయోగించడం వలన లాభాలు

ఆకర్షణీయమైన  Anubhuti యాప్ ఫీచర్ల గురించి తెలుసుకున్నాము మనం ఇప్పుడు అది జాన్ డియర్ ఇండియా కస్టమర్లకు అందించిన అమూల్యమైన ప్రయోజనాలను పరిశీలిద్దాం.

దాని సహజమైన ఇంటర్‌ఫేస్ మరియు బహుభాషా మద్దతుతో, యాప్ విభిన్న భాషా నేపథ్యాలలో వినియోగదారులకు ప్రాప్యత ఉండేలా చూస్తుంది,  సులభంగా ఉపయోగించే వీలు కల్పిస్తుంది .

మెరుగైన ప్రాప్యత

HeadingIcon

దాని సహజమైన ఇంటర్‌ఫేస్ మరియు బహుభాషా మద్దతుతో, యాప్ విభిన్న భాషా నేపథ్యాలలో వినియోగదారులకు ప్రాప్యత ఉండేలా చూస్తుంది,  సులభంగా ఉపయోగించే వీలు కల్పిస్తుంది .

యాప్ పార్ట్స్ సేకరణ, సర్వీస్ అభ్యర్థనలు మరియు ఆపరేటర్ మాన్యువల్ ప్రాప్యత వంటి సేవలను కేంద్రీకరించడం ద్వారా వినియోగదారుల కార్యకలాపాలను క్రమబద్ధీకరిస్తుంది, వారి ఉపకరణాలను నిర్వహించడంలో వారికి సమయం  ఆదా చేసి శ్రమ తగ్గిస్తుంది .

క్రమబద్దీకరించిన ఆపరేషన్స్

HeadingIcon

యాప్ పార్ట్స్ సేకరణ, సర్వీస్ అభ్యర్థనలు మరియు ఆపరేటర్ మాన్యువల్ ప్రాప్యత వంటి సేవలను కేంద్రీకరించడం ద్వారా వినియోగదారుల కార్యకలాపాలను క్రమబద్ధీకరిస్తుంది, వారి ఉపకరణాలను నిర్వహించడంలో వారికి సమయం  ఆదా చేసి శ్రమ తగ్గిస్తుంది .

నమోదు చేసుకున్న కస్టమర్‌లు ప్రత్యేక ప్రాప్యత మరియు వ్యక్తిగతీకరించిన సేవలను ఆనందిస్తారు, జాన్ డియర్ తో వారి మొత్తం అనుభవాన్ని  మెరుగుపరచుకుంటూ దీర్ఘకాలిక విధేయతనుకొనసాగిస్తారు .

వ్యక్తిగత అనుభవం

HeadingIcon

నమోదు చేసుకున్న కస్టమర్‌లు ప్రత్యేక ప్రాప్యత మరియు వ్యక్తిగతీకరించిన సేవలను ఆనందిస్తారు, జాన్ డియర్ తో వారి మొత్తం అనుభవాన్ని  మెరుగుపరచుకుంటూ దీర్ఘకాలిక విధేయతనుకొనసాగిస్తారు .

సమాచారం మరియు నోటిఫికేషన్‌ల ద్వారా, వినియోగదారులు ప్రోడక్ట్ అప్‌డేట్‌లు, ప్రోత్సాహకాలు మరియు ఇండస్ట్రీ ఇన్‌సైట్‌ల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకుంటారు, అది వారిని అవగాహనపూర్వకంగా నిర్ణయాలు తీసుకునేలా చేస్తుంది.

సమయానుసార సమాచారం

HeadingIcon

సమాచారం మరియు నోటిఫికేషన్‌ల ద్వారా, వినియోగదారులు ప్రోడక్ట్ అప్‌డేట్‌లు, ప్రోత్సాహకాలు మరియు ఇండస్ట్రీ ఇన్‌సైట్‌ల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకుంటారు, అది వారిని అవగాహనపూర్వకంగా నిర్ణయాలు తీసుకునేలా చేస్తుంది.

Anubhuti యాప్‌తో ప్రారంభించడం ఎలా?

Anubhuti యాప్‌తో ప్రారంభించడం సులభం. మెరుగైన సమర్ధత మరియు ఉత్పాదకత ప్రయాణాన్ని సాగించడానికి ఈ దశలు అనుసరించండి:

  • గూగుల్ ప్లే స్టోర్ నుండి Anubhuti యాప్ డౌన్ లోడ్ చేయండి
  • మీ జాన్ డియర్ ట్రాక్టర్ ఛాసి నంబర్‌ను నమోదు చేయడం ద్వారా ఖాతాను రూపొందించండి లేదా కొత్త వినియోగదారుగా సైన్ అప్ చేయండి
  • సహజమైన ఆన్‌బోర్డింగ్ ద్వారా యాప్ ఫీచర్‌లు మరియు కార్యాచరణలతో అలవాటు చేసుకోండి
  • పరికరాల నిర్వహణ, విడిభాగాలను ఆర్డర్ చేయడం మరియు సాంకేతిక డాక్యుమెంటేషన్ వంటి వివిధ ప్రత్యేకతల గురించి తెలుసుకోండి
  • అదనపు సహాయం లేదా సమాచారం కోసం యాప్ యొక్క యూజర్ గైడ్ మరియు డాక్యుమెంటేషన్‌ను చూడండి.

జాన్ డియర్  ఇండియా కస్టమర్ల కోసం ఈ Anubhuti యాప్ ఒక గేమ్-ఛేంజర్‌గా ఉంది. ఇది పరికరాల నిర్వహణను క్రమబద్ధీకరించడానికి, విడిభాగాలను ఆర్డర్ చేయడానికి మరియు సాంకేతిక సమాచారాన్ని పొందడానికి సమగ్ర పరిష్కారాన్ని అందిస్తుంది.

దాని వినియోగదారు-హితమైన  ఇంటర్‌ఫేస్, నిజ-సమయ పర్యవేక్షణ మరియు నిరంతర కమ్యూనికేషన్ ఫీచర్‌లతో, యాప్ సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి, వనరులను ఆప్టిమైజ్ చేయడానికి మరియు కస్టమర్ అనుభవాన్ని మెరుగుపరచడానికి మీకు వీలు కల్పిస్తుంది.

మీరు Anubhuti యాప్‌తో మీ ప్రయాణాన్ని ప్రారంభించినప్పుడు, యాప్ యొక్క విస్తృతమైన వనరులను ఉపయోగించుకోవడం మరియు ఏదైనా సహాయం లేదా మార్గదర్శకత్వం కోసం జాన్ డియర్  నిపుణులతో కనెక్ట్ అవ్వడం గుర్తుంచుకోండి. సాంకేతికత యొక్క శక్తిని స్వీకరించండి మరియు జాన్ డియర్ తో మీ సంబంధాన్ని ఉత్పాదకత మరియు విజయాలను నూతన శిఖరాలకు తీసుకెళ్లండి.

వ్యవసాయ పరికరాల నిర్వహణ యొక్క భవిష్యత్తు ఇక్కడ ఉంది – Anubhuti యాప్ ప్రపంచానికి స్వాగతం.