జాన్ డీర్ 5D సిరీస్ ట్రాక్టర్‌లు 36HP నుండి 55 HP వరకు అందుబాటులో ఉంటాయి. 5D సిరీస్ ట్రాక్టర్లు బహుళ-వినియోగాన్ని కలిగి ఉంటాయి, వ్యవసాయ పనిముట్లు మరియు హెవీ డ్యూటీ రవాణా రెండింటిలోనూ కూడా ప్రభావవంతంగా పనిచెస్తాయి. ఈ ట్రాక్టర్లు వైడర్ ఆపరేటర్ స్టేషన్, న్యూట్రల్ సేఫ్టీ స్విచ్ మరియు తక్కువ నిర్వహణ ఖర్చులతొ అధిక సౌకర్యాన్ని అందిస్తాయి. జాన్ డీర్ 5డ్ సిరీస్‌లో పవర్‌ప్రో మోడల్ మరియు వాల్యూ+++ మోడల్ ఉన్నాయి, మీ అవసరానికి ఎంచుకోవడానికి విస్తృత శ్రేణి ట్రాక్టర్‌లను అందిస్తోంది.
జాన్ డీర్ 5E సిరీస్ ట్రాక్టర్స్ 50HP నుండి 74HP వరకు అందుబాటులో ఉన్నాయి. 5E సిరీస్ ట్రాక్టర్‌లు హెవీ-డ్యూటీ అప్లికేషన్‌ల కోసం మరియు పెద్ద-పరిమాణ పనిముట్లను గొప్ప సౌలభ్యం మరియు సామర్థ్యంతో నిర్వహించడానికి ప్రత్యేకంగా రూపొందించారు.
జాన్ డీర్ స్పెషాలిటీ ట్రాక్టర్స్ 28HP నుండి 35HP వరకు ఉంటాయి. ఈ సన్నని వెడల్పు కలిగిన ట్రాక్టర్స్ కేవలం సౌకర్యాన్ని తీసుకురావడానికి మాత్రమే కాకుండా, పండ్ల తోటల పెంపకం, ఇంటర్కల్చరల్ మరియు పుడ్లింగ్ కార్యకలాపాలలో అపారమైన సౌలభ్యం కోసం నైపుణ్యంతో రూపొందించారు.
శక్తి మరియు సాంకేతికతతో నిండిన అత్యుత్తమ వ్యవసాయ ఉత్పత్తులను జాన్ డియర్ మీకు అందిస్తుంది. ఇటీవల ప్రవేశపెట్టిన సాంకేతికతలు, ఉత్పత్తులు మరియు ఫీచర్ లైనప్‌తో అప్‌డేట్‌గా ఉండండి!
అన్ని అంశాలలో ఆధునిక సాంకేతికత ఉపయోగించడం ద్వారా తక్కువ ఎకరాల భూమిలో ఎక్కువ దిగుబడిని పొందండి - భూమిని సిద్ధం చేయడం , విత్తడం , ఎరువుల వేయడం , హార్వెస్టింగ్ మరియు పోస్ట్ హార్వెస్టింగ్ !
JDలింక్™ అనేది జాన్ డీర్ చే పరిచయం చేయబడిన ఒక వినూత్న అప్లికేషన్, ఇది మీ ట్రాక్టర్స్ ఆరోగ్యాన్ని తనిఖీ చేయడానికి మరియు మీ ట్రాక్టర్‌తో ఎప్పుడైనా ఎక్కడైనా కనెక్ట్ అవ్వడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది.
జాన్ డీర్ ట్రాక్టర్ ప్రైస్ రేంజ్ రూ.4.80 లక్షల నుంచి రూ.29 లక్షల వరకు ఉంది
జాన్ డీర్ HP ట్రాక్టర్ 28HP నుండి 120HP వరకు ఉంటుంది.
జాన్ డీర్ ఆటోట్రాక్™ అనేది ఆటోమేటెడ్ వెహికల్ గైడెన్స్ సిస్టమ్. ఇది ఆపరేటర్‌కు హ్యాండ్స్-ఫ్రీ స్ట్రెయిట్ పాత్ గైడెన్స్‌ను అందిస్తుంది, ఫీల్డ్‌లో ఉత్పాదకతను మెరుగుపరుస్తుంది,& ఆపరేషన్ అలసటను బాగా తగ్గిస్తుంది.
జాన్ డీర్ ట్రాక్టర్ ప్రైస్ ఎంక్వయిరీ పేజీలో మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు మరియు ప్రైస్ జాబితా గురించి మరింత తెలుసుకోవచ్చు.
జాన్ డీర్ మినీ ట్రాక్టర్లు లేదా స్పెషాలిటీ ట్రాక్టర్‌లు 28HP నుండి 35HP వరకు ఉంటాయి. ఈ నారో విడ్త్ ట్రాక్టర్లు పండ్ల తోటల పెంపకం, ఇంటర్కల్చరల్ మరియు పుడ్లింగ్ కార్యకలాపాలకు నైపుణ్యంగా ఉన్నాయి.
జాన్ డీర్ సమగ్రమైన 5-సంవత్సరాలు లేదా 5000 గంటల వారంటీని అందజేస్తుంది, ఇది దాని అన్ని ట్రాక్టర్‌లపై మొదటి అమ్మకం తేదీ నుండి ఏది ముందు అయితే అది ఉంటుంది
“2WD” అంటే “టూ-వీల్ డ్రైవ్”. 2WD ట్రాక్టర్లలో, అన్ని ట్రాక్షన్ వెనుక చక్రాలకు మళ్ళించబడుతుంది మరియు తక్కువ టర్నింగ్ రేడియస్‌ను అనుమతిస్తుంది. 2WD ట్రాక్టర్లు అగ్రికల్చరల్ మరియు హౌలేజ్ అప్లికేషన్లకు ఎక్కువగా ప్రాధాన్యతనిస్తాయి. జాన్ డీర్ 2WD ట్రాక్టర్లు నిర్వహణలో తక్కువగా ఉండటమే కాకుండా సామర్థ్యం మరియు సౌలభ్యం కూడా ఎక్కువగా కలిగి ఉంటాయి.
“4WD” అంటే “ఫోర్-వీల్ డ్రైవ్”. 4WD ట్రాక్టర్లలో, ట్రాక్టర్‌ను ముందుకు లాగడానికి ముందు చక్రాలు వెనుక చక్రాలకు సహకరిస్తాయి. నాలుగు చక్రాలకు ట్రాన్స్‌మిషన్ నుండి పవర్ సరఫరా చేయబడుతుంది, ఇది తక్కువ జారడానికి దారితీస్తుంది మరియు అధిక ట్రాక్షన్‌ను అందిస్తుంది. పవర్ మరియు టెక్నాలజీతో నిర్మించబడిన, జాన్ డీర్ 4WD ట్రాక్టర్లు వేగవంతమైన పనితీరును అందిస్తాయి మరియు హెవీ-డ్యూటీ అప్లికేషన్‌ల కోసం ప్రత్యేకంగా రూపొందించబడ్డాయి.