ట్రాక్టర్ల అసమానమైన శక్తి, పనితీరు మరియు ఉత్పాదకత కారణంగా జాన్ డియర్ ట్రాక్టర్ 5050ని రైతులు బాగా ఇష్టడతారు. 2WD మరియు 4WD రెండింటిలోనూ అందుబాటులో ఉంది, ఈ వ్యవసాయ ట్రాక్టర్ అన్ని హెవీ డ్యూటీ వ్యవసాయ అప్లికేషన్లకి అనుకూలంగా ఉంటుంది.
వీటి కోసం చూడండి
శ్రమ లేకుండా పనిచేయడానికి సైడ్ షిఫ్ట్ గేర్ లివర్స్‌తో సౌకర్యవంతమైన సీటు
జాన్ డీర్ 5050D అనేది శక్తివంతమైన, నమ్మదగిన మరియు 50HP ...శ్రేణిలో రైతుల మొదటి ఎంపిక అయిన ట్రాక్టర్. జాన్ డీర్ 5050D భారతదేశంలో శక్తివంతమైన 50 HP ట్రాక్టర్. ఈ సమర్థవంతమైన ట్రాక్టర్ కల్టివేటర్, రోటవేటర్ లేదా MB నాగలి వంటి వ్యవసాయ పనిముట్లకు అనువుగా ఉంటుంది, ఇది విత్తడానికి విత్తన డ్రిల్ లేదా ప్లాంటర్ మరియు నాటడానికి కూడా సరిపోతుంది. ఈ ట్రాక్టర్‌ను అత్యంత బహుముఖ ట్రాక్టర్లలో ఒకటిగా కూడా పిలుస్తారు, ఎందుకంటే మీరు దున్నడం కోసం దీనిని ఉపయోగించినప్పటికీ, మీరు రోటవేటర్, ఫుల్ కేజ్ లేదా హాఫ్ కేజ్‌తో దున్నినా అందులో అద్భుతమైన పనితీరు కనిపిస్తుంది. 5050D ట్రాక్టర్ యొక్క అన్ని ఫీచర్లు, స్పెసిఫికేషన్లు, కస్టమర్ ప్రయోజనాలు మరియు కస్టమర్ రివ్యూల గురించిన వివరణాత్మక సమాచారాన్ని తెలుసుకోవడానికి చదవండి. PTO అప్లికేషన్లకు సంబంధించి, ఇది థ్రెషర్, మల్చర్, స్ట్రా రీపర్, మడ్ మిక్సర్, పోస్ట్ హోల్ డిగ్గర్ మొదలైన 30+ అప్లికేషన్ల కోసం ఉపయోగించవచ్చు. దీనికి రివర్స్ PTO, ఎకానమీ PTO మరియు స్టాండర్డ్ PTO ఎంపికలు కూడా ఉన్నాయి. అడ్జస్టబుల్ ఫ్రంట్ యాక్సిల్ ఆప్షన్ కూడా ఇవ్వబడింది, తద్వారా మీరు రైతులకు అవసరానికి అనుగుణంగా ఇరుసు వెడల్పును సర్దుబాటు చేయవచ్చు. ట్రాక్టర్ కొనుగోలుదారు 4WDతో పాటు పెద్ద మరియు విస్తృత ఫ్రంట్ టైర్ల కోసం కూడా ఒక ఎంపికను పొందుతాడు. పెద్ద టైర్లు తక్కువ జారడం, ఎక్కువ ట్రాక్షన్ మరియు చివరికి ఎక్కువ ఉత్పాదకతను కలిగి ఉంటాయి కాబట్టి ఇది ప్రత్యేకంగా పుడ్లింగ్లో సహాయకరంగా ఉంటుంది. దీనికి తోడు డీజిల్ వినియోగం కూడా చాలా తక్కువ. ఈ 50HP ట్రాక్టర్లో ప్లానెటరీ గేర్ మరియు స్ట్రెయిట్ యాక్సిల్ కూడా ఉన్నాయి, ఇది వెనుక చక్రంపై ఏకరీతిలో లోడ్‌ను పంపిణీ చేస్తుంది మరియు ఇరుసులు మరియు ట్రాన్స్మిషన్ యొక్క జీవితకాలం పెరుగుతుంది. ఈ ట్రాక్టర్ 8+4 (8 ఫార్వర్డ్ మరియు 4 రివర్స్) గేర్ ఆప్షన్లతో పూర్తిగా స్థిరమైన మెష్ గేర్‌బాక్స్‌ను కూడా కలిగి ఉంది. పూర్తిగా స్థిరమైన మెష్ గేర్ మృదువైన గేర్ షిఫ్టింగ్, బేరింగ్ కోసం తక్కువ ఘర్షణ మరియు దానివలన తక్కువ నిర్వహణను నిర్ధారిస్తుంది.
స్ట్రెయిట్ యాక్సిల్‌తో ఉన్న ప్లానెటరీ గేర్ విడిగా ఉన్న గేర్లు మరియు షాఫ్ట్లపై ఒత్తిడిని తగ్గించడానికి మూడు పాయింట్లకు పైగా వెనుక యాక్సిల్ లోడ్లను సమానంగా పంపిణీ చేస్తుంది
తక్కువగా అరిగిపోవడం మరియు పాడవడం వలన యాక్సిల్ ఎక్కువ కాలం మన్నేలా చేస్తుంది
JD లింక్ అనేది జాన్ డియర్ ప్రవేశపెట్టిన ఒక వినూత్న అప్లికేషన్, ఇది మీ ట్రాక్టర్స్ పనితీరుని తనిఖీ చేయడానికి మరియు మీ ట్రాక్టర్‌తో ఎప్పుడైనా ఎక్కడైనా కనెక్ట్ అవ్వడానికి మీకు వీలు కల్పిస్తుంది.
ఉత్పత్తిలో మెరుగుదల ఒక నిరంతర ప్రక్రియ. అందువల్ల ఇక్కడ ఇచ్చిన సమాచారాన్ని ముందస్తు నోటీసు లేకుండా మార్చవచ్చు.
చూపించిన యాక్సెసరీలు ప్రామాణిక పరికరాలలో భాగం కాదు. దయచేసి మరింత వివరణాత్మక సమాచారం కోసం మీ సమీప డీలర్‌ను సంప్రదించండి. పైన ఫీచర్లలో కొన్ని ఐచ్ఛికంగా ఉంటాయి. మరిన్ని వివరాల కోసం, దయచేసి ఆన్లైన్ బ్రోచర్‌ని చూడండి లేదా మీ సమీప డీలర్‌ను సంప్రదించండి.