లుబ్రికెంట్స్

జాన్ డియర్ టార్క్-గార్డ్ ఇంజిన్ ఆయిల్

జాన్ డియర్ ఇండియా భాగాలు, ట్రాక్టర్ లుబ్రికెంట్, టార్క్ గార్డ్, రైట్ ప్రొఫైల్

మీ జాన్ డియర్ మెషిన్ కోసం సరైన ఇంజిన్ ఆయిల్

జాన్ డియర్ ఇంజిన్ ఆయిల్‌తో మీ మెషిన్ బాగా పనిచేస్తుందని నిర్ధారించుకోండి.

మీ జాన్ డియర్ పరికరాల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఇంజిన్ ఆయిల్; . సుదీర్ఘ ఇంజిన్ జీవితకాలం ఉండేలా మరియు మృదువుగా పనిచేసేలా చూస్తుంది.

 

ఇది మీ ఇంజిన్‌కి భిన్నంగా ఎలా పని చేస్తుంది?

ఇంజిన్ లోపల ఇంధనం మండినప్పుడు అది శక్తిని ఉత్పత్తి చేస్తుంది ఇది హైడ్రాలిక్ సిస్టమ్ మరియు ట్రాన్స్మిషన్‌కు ప్రసారం అవుతుంది, అదే సమయంలో ఉష్ణం కూడా ఉత్పత్తి అవుతుంది. ఇంజన్ అధిక వేగం తో కదిలే భాగాలను కలిగి ఉంటుంది, ఇవి రాపిడి కారణంగా అరిగిపోయి పాడయ్యే అవకాశం ఉంది. ఘర్షణ మరియు ఉష్ణం రెండింటినీ భర్తీ చేయడానికి సమర్థవంతమైన లుబ్రికేషన్ వ్యవస్థ అవసరం.

జాన్  డియర్ పరికరాలు ప్రత్యేకంగా తయారుచేసిన ఇంజన్ ఆయిల్‌ను ఉపయోగించే అధునాతన లూబ్రికేషన్ సిస్టమ్‌తో అమర్చబడి ఉంటాయి.

జాన్ డియర్ ఇంజన్ ఆయిల్ అనేది ప్రత్యేకంగా తయారుచేసిన కంపౌండ్స్ మరియు బేస్ ఆయిల్ యొక్క సంపూర్ణ మిశ్రమం, ఇది ఇంజిన్ లోపల అరిగిపోకుండా ఇంకా పాడవకుండా చూస్తుంది, హానికరమైన వ్యర్ధాలని తగ్గిస్తుంది మరియు వేడిని సమానంగా వర్తింపజేస్తుంది, ఫలితంగా ఎక్కువ కాలం, అవరోధం లేని జీవితకాలం మరియు ఇంజిన్ యొక్క మెరుగైన పనితీరు అందిస్తుంది.

 


 

జాన్ డియర్ హై-గార్డ్ ట్రాన్స్మిషన్ ఆయిల్

జాన్ డియర్ హై-గార్డ్ ట్రాన్స్మిషన్ ఆయిల్

మీ ట్రాన్స్మిషన్ కోసం ఉత్తమ ఆయిల్ ఎంపిక చేసుకోండి

జాన్ డియర్ హై-గార్డ్ ట్రాన్స్‌మిషన్ ఆయిల్‌ని ఉపయోగించడం ద్వారా గేర్ మార్చడం ఎల్లప్పుడూ సజావుగా ఉండేలా చూసుకోండి - మీ మెషీన్ యొక్క మెరుగైన పనితీరు మరియు మెరుగైన పవర్ ట్రాన్స్‌మిషన్ కోసం ప్రత్యేకంగా రూపొందించబడింది.

 

మీ మెషీన్‌కు హై-గార్డ్ ఆయిల్ ఏ విధంగా ఉత్తమమైనది?

జాన్ డియర్ పరికరం ట్రాన్స్‌మిషన్ సిస్టమ్‌లో హై-టెక్, ప్రెసిషన్ ఇంజినీర్డ్ గేర్ ట్రైన్ ఉంటుంది ఇది ఇంజన్ నుండి చక్రాలకు మరియు PTO షాఫ్ట్‌కు శక్తిని బదిలీ చేయడానికి సినర్జీలో పని చేస్తుంది. సమర్థవంతమైన పవర్ ట్రాన్స్‌మిషన్ కోసం మరియు రాపిడి మరియు ఉష్ణం కారణంగా   అరిగిపోవడం మరియు పాడవడం తగ్గించడానికి  ఈ గేర్ ట్రైన్స్ ని బాగా లూబ్రికేట్ చేయాలి.

మెరుగైన లూబ్రికేషన్ మరియు సరైన ఆపరేటింగ్ ఉష్ణోగ్రతలు అధిక శక్తి బదిలీ సామర్థ్యం, ఉత్పాదకత మరియు గేర్లు మరియు ట్రాన్స్‌మిషన్ సిస్టమ్ భాగాల యొక్క సుదీర్ఘ నిర్వహణ-రహిత జీవితకాలం ఉండేలా చూస్తాయి.

జాన్ డియర్ ట్రాన్స్‌మిషన్ ఆయిల్ అనేది ప్రత్యేకంగా తయారుచేసిన లూబ్-ఆయిల్, ఇది మీ జాన్ డియర్ పరికరాల అన్ని పనితీరు అవసరాలను తీరుస్తుంది. దీని అద్భుతమైన యాంటీ-ఫ్రిక్షన్ మరియు యాంటీ-వెల్డ్ ఏజెంట్లు జాన్‌ డియర్ పరికరాలలో ఉపయోగించే అధిక-టార్క్ పవర్ ట్రైన్‌లకు అనుకూలంగా ఉంటాయి.

 


 

జాన్ డియర్ గ్రీజ్-గార్డ్ ప్రీమియం

      

జాన్ డియర్ గ్రీజ్-గార్డ్ ప్రీమియం

మీ లుబ్రికేషన్ అవసరాలను తీర్చడానికి ప్రత్యేకంగా రూపొందించిన గ్రీజు

- జెర్క్స్ ఉన్నప్పుడు అద్భుతమైన మెకానికల్ స్టెబిలిటీ -
- వాటర్ రెసిస్టెంట్-
- యాంటీ-రస్ట్, –యాంటీ కరోషన్ మరియు హై ఆక్సిడేషన్ స్టెబిలిటీ