ట్రాక్టర్ ఫైనాన్సింగ్

ట్రాక్టర్ ఫైనాన్సింగ్

వ్యవసాయం మరియు వాణిజ్య రైతులకు అనుకూలీకరించిన పరిష్కారాలు

మేము ఉత్పత్తులను మాత్రమే అమ్మడం లేదు. మేము రైతులు వారి కావలసిన స్థాయి సామర్థ్యాన్ని సాధించడంలో సహాయపడే అనుకూలీకరించిన పరిష్కారాలను అందిస్తున్నాము. రైతులకు రుణమిచ్చేటప్పుడు, జాన్ డియర్ ఫైనాన్షియల్ పొలం యొక్క మొత్తం ఉత్పత్తి విలువతో పాటుగా రైతుల ఆదాయ వనరులు మరియు ’ఆర్థిక సామర్థ్యాన్నిపరిగణనలోకి తీసుకుంటుంది మరియు పరికరాలపై 90% వరకు ఫైనాన్స్ అందించవచ్చు.

ట్రాక్టర్ లోన్ లోన్ EMI

అనువైన రుణ వ్యవధులు

రుణం ఇచ్చే వ్యవధిలో సౌలభ్యం రైతుకు చెల్లించే స్థోమతని ఇస్తుంది. మేము 5 సంవత్సరాల కాలం వరకు నిధులు అందిస్తాము.

అనుకూలమైన మరియు సౌకర్యవంతమైన రీపేమెంట్ ప్రణాలికలు

జాన్ డియర్ ఫైనాన్షియల్‌కి వ్యవసాయం యొక్క కాలానుగుణత తెలుసు మరియు దానిని అర్థం చేసుకుంటుంది. నగదు లావాదేవీలు అనేవి వ్యాపారం యొక్క ముఖ్యమైన భాగం అని మేము అర్థం చేసుకున్నాము. ఆరోగ్యకరమైన నగదు లావాదేవికి మద్దతు ఇవ్వడం ద్వారా, మేము మీ వ్యవసాయ / సంస్థ యొక్క ఆరోగ్యకరమైన వృద్ధిని ప్రోత్సహిస్తాము. మేము రైతుల పంటల విధానం మరియు వారి అవసరానికి తగినట్లుగా నగదు లావాదేవి ఆధారంగా నెలవారీ లేదా’త్రైమాసిక మరియు అర్ధ-వార్షిక వాయిదాలను అందిస్తాము.

టోల్ ఫ్రీ నెంబర్- 18002091034
ఇమెయిల్ID- jdfindiacustomercare@johndeere.com