భారతదేశంలో లభ్యంగా ఉన్న జాన్ డియర్ ట్రాక్టర్ మోడల్స్ విస్తృత శ్రేణిని అన్వేషిద్దాం

John deere power tech tractors

వ్యవసాయం, ల్యాండ్‌స్కేపింగ్ లేదా మైదానాలను నిర్వహించడం విషయానికి వస్తే, సరైన పరికరాలు కలిగి ఉంటే ఆ వ్యత్యాసం కనిపిస్తుంది. భారతదేశంలో ప్రముఖ ట్రాక్టర్ తయారీదారుగా, జాన్ డియర్ దేశవ్యాప్తంగా రైతులు, ల్యాండ్‌స్కేపర్లు మరియు మైదానాల నిర్వాహకుల విభిన్న అవసరాలను అర్థంచేసుకుంది . వివిధ అప్లికేషన్లకు అనుగుణంగా విస్తృత శ్రేణి ట్రాక్టర్ మోడల్స్‌తో, జాన్ డియర్ విశ్వసనీయత, పనితీరు మరియు వినూత్నతలకు మారుపేరుగా మారింది.

భారతదేశంలో లభ్యంగా ఉన్న జాన్ డియర్ ట్రాక్టర్ మోడల్స్‌కు చెందిన శ్రేణిని నిశితంగా పరిశీలిద్దాం, వాటిలో ప్రతీ ఒక్కటీ ప్రత్యేక అవసరాలు మరియు ప్రాధాన్యతలను తీర్చడానికి రూపొందించబడ్డాయి.

డి సిరీస్ ట్రాక్టర్లు

జాన్ డియర్ యొక్క 5D సిరీస్ ట్రాక్టర్లు వెర్సటాలిటీ మరియు సామర్థ్యానికి నిదర్శనం. 36 HP నుండి 50 HP వరకు, ఈ ట్రాక్టర్‌లు వ్యవసాయ పనులు మరియు హెవీ డ్యూటీ రవాణా పనులు రెండింటిలోనూ రాణించేలా రూపొందించబడ్డాయి.

5D సిరీస్ లో విశాలమైన ఆపరేటర్ స్టేషన్, న్యూట్రల్ సేఫ్టీ స్విచ్ మరియు తక్కువ నిర్వహణ ఖర్చులు లాంటి ఫీచర్లతో అధిక సౌకర్య స్థాయిలు అందిస్తుంది . 5D సిరీస్‌లో, కస్టమర్‌లు PowerPro మోడల్‌లు మరియు Value+++ మోడల్‌ల నుండి ఎంచుకోవచ్చు, ప్రతి అవసరానికి తగిన ట్రాక్టర్ అందుబాటులో ఉంటుంది.

కొన్ని ప్రత్యేకమైన నమూనాలను నిశితంగా పరిశీలిద్దాం:

 • 5036 - 2WD మరియు ప్రామాణిక క్లచ్ ఎంపికలతో 36 HP ట్రాక్టర్.
 • 5105 - 40 HP మరియు డ్యూవల్ క్లచ్ ఎంపికలతో 2WD మరియు 4WD వేరియెంట్లలో సౌలభ్యం.
 • 5205 - 48 HPని అందించే, ఈ 2WD ట్రాక్టర్ ప్రామాణిక మరియు డ్యూయల్ క్లచ్ ఎంపికలు అందిస్తుంది.
 • 5039D PowerPro – సమర్ధవంతంగా వ్యవసాయం చేయడానికి 41 HP ఇంజన్ మరియు 8+4 కాలర్ షిఫ్ట్ ట్రాన్స్‌మిషన్‌ వెర్సటైల్ 2WD ట్రాక్టర్.
 • 5042D PowerPro – మెరుగైన ఉత్పాదకత కోసం 44 HP ఇంజన్ మరియు ప్రామాణిక/ డ్యూవల్/ రివర్స్ PTO ఎంపికలు గల శక్తివంతమైన 2WD ట్రాక్టర్.
 • 5045D PowerPro - కార్యకలాపాలు సాఫీగా సాగిపోవడానికి 46 HP ఇంజన్ మరియు ప్రామాణిక/ డ్యూయల్ క్లచ్ ఎంపికలను అందించే విశ్వసనీయమైన 2WD మరియు 4WD ట్రాక్టర్.
 • 5045D GearPro - అన్ని వ్యవసాయ పనులకు ఎక్కువ బ్యాకప్ టార్క్ మరియు మెరుగైన ఉత్పాదకతతో 46 HP పవర్ ప్యాక్ వ్యవసాయ ట్రాక్టర్. 
 • 5050D GearPro – మెరుగైన సామర్ధ్యం కోసం 50 HP ఇంజన్ మరియు కాలర్ షిఫ్ట్ ట్రాన్స్‌మిషన్‌తో అధిక పనితీరును అందించే 2WD మరియు 4WD ట్రాక్టర్.

5D సిరీస్‌లోని ప్రామాణిక ఫీచర్లు గేర్‌బాక్స్‌లో టాప్ షాఫ్ట్ లూబ్రికేషన్, పిస్టన్ స్ప్రే కూలింగ్ జెట్ మరియు మన్నికకు మరియు నిర్వహణ తక్కువగా ఉండేలా చూడటానికి మెటల్ ఫేస్ సీల్‌తో వెనుక ఆయిల్ యాక్సిల్ ఉన్నాయి.

E సిరీస్ ట్రాక్టర్లు

హెవీ-డ్యూటీ అఫ్లికేషన్లు మరియు అతిపెద్ద ఇంప్లిమెంట్స్ సులభంగా హ్యాండిల్ చేయటానికి, జాన్ డియర్ 5E సిరీస్ ట్రాక్టర్లను  అందిస్తుంది. 50 HP నుండి 74 HP వరకు, ఈ ట్రాక్టర్లు సమర్ధత మరియు విశ్వసనీయతతో కష్టతరమైన వ్యవసాయ పనులను పరిష్కరించడానికి రూపొందించబడ్డాయి.

విశేషమైన మోడల్స్‌లో చేరి ఉన్నవి:

 • 5210 GearPro - 2WD మరియు 4WD వేరియెంట్లు రెండింటిలో బహుముఖ సామర్ధ్యంతో అందుబాటులో ఉన్న 50 HP ట్రాక్టర్.
 • 5310 PowerTech ™ - 57 HPతో ఈ ట్రాక్టర్ , విభిన్న అవసరాలకు తగినట్లుగా విభిన్న ట్రాన్స్‌మిషన్లను అందిస్తుంది.
 • 5405 PowerTech ™ - ఇది సమర్థవంతమైన ఇంధన వినియోగం మరియు పర్యావరణ నియంత్రణ కోసం ఆధునిక టెక్నాలజీ అందిచేశక్తివంతమైన మరియు వెర్సటైల్ 63 HP ట్రాక్టర్.
 • 5075 PowerTech ™ - పటిష్టమైన 74 HPని అందించే, ఈ ట్రాక్టర్ మెరుగైన పనితీరు కోసం డ్యూవల్ క్లచ్ ఎంపికలతోవస్తుంది .

ప్రత్యేకత గల ట్రాక్టర్లు

జాన్ డియర్ స్పెషాలిటీ ట్రాక్టర్‌లు, 28 HP నుండి 35 HP వరకు ఉంటాయి, ఇవి ఆర్చర్డ్ ఫార్మింగ్, ఇంటర్‌కల్చరల్ మరియు పడ్లింగ్ కార్యకలాపాలలాంటి తక్కువ వెడల్పు అప్లికేషన్ల కోసం నైపుణ్యంతో రూపొందించబడ్డాయి. ఈ ట్రాక్టర్లు సౌకర్యానికి ప్రాధాన్యత ఇవ్వడమే కాకుండా ప్రత్యేక వ్యవసాయ పనులలో అపారమైన సౌకర్యాన్ని కూడా అందిస్తాయి.

ప్రత్యేక మోడల్స్‌లో చేరి ఉన్నవి:

 • 3028EN - ఇది డ్యూవల్ క్లచ్ ఎంపికలు గల 28 HP 4WD ట్రాక్టర్.
 • 3036EN - ప్రామాణిక మరియు వెడల్పాటి టైర్ వేరియెంట్లు రెండింటిలో లభ్యంగా ఉన్న ఈ 35 HP ట్రాక్టర్ విశిష్టమైన మరియు సమర్ధవంతమైన పనితీరును అందిస్తుంది.

జాన్ డియర్ వారి విస్తృత శ్రేణి ట్రాక్టర్ మోడళ్ళతో, భారతదేశంలోని రైతులు తమ ప్రత్యేక అవసరాలకు తగినట్లుగా అనుకూలమైన ఉపకరణాలను పొందగలుగుతున్నారు. ఇదివెర్సటాలిటీ , శక్తి లేదా ప్రత్యేక కార్యాచరణ ఏది అయినా, జాన్ డియర్ ట్రాక్టర్‌లు ఈ రంగంలో సాటిలేని పనితీరు మరియు విశ్వసనీయతలను అందిస్తాయి. కాబట్టి, మీరు చిన్న రైతు అయినా లేదా పెద్ద వ్యవసాయ కార్యకలాపాలను నిర్వహించే వారు అయినా, మీ వ్యవసాయ అనుభవాన్ని మెరుగుపరచడానికి జాన్ డియర్ ట్రాక్టర్ సిద్ధంగా ఉంటుంది .

భారతదేశంలో సౌలభ్యంగా ఉన్న జాన్ డియర్ వారి ట్రాక్టర్ల సంపూర్ణ శ్రేణి గురించి మరింత సమాచారం తెలుసుకోవటానికి, జాన్ డియర్ వెబ్ సైట్ ని సందర్శించండి.