ట్రాక్టర్ ఫైనాన్సింగ్

ట్రాక్టర్ ఫైనాన్సింగ్

జాన్ డియర్  నుండి ట్రాక్టర్ ఫైనాన్సింగ్ రైతులకు అధునాతన ట్రాక్టర్లను సులభంగా పొందడంలో సహాయపడే అనుకూలమైన ఆర్థిక పరిష్కారాలను అందిస్తుంది. రైతు ఆదాయ వనరులు మరియు వ్యవసాయ విలువను పరిగణనలోకి తీసుకుని, జాన్ డియర్  ఫైనాన్షియల్ ట్రాక్టర్ ఖర్చులో 90% వరకు రుణాలను అందిస్తుంది. ఈ పథకం 5 సంవత్సరాల వరకు సౌకర్యవంతమైన రుణ కాలపరిమితికి మద్దతు ఇస్తుంది, అలాగే వ్యవసాయ ఆదాయ చక్రాలకు అనుగుణంగా ఉండే అనుకూల తిరిగి చెల్లించే షెడ్యూల్‌లను అందిస్తుంది. ఇది రైతులకి ఆర్థిక ఒత్తిడి లేకుండా ఉత్పాదకతపై దృష్టి పెట్టడానికి వీలు కల్పిస్తుంది.

రైతుల కోసం అనుకూలమైన ట్రాక్టర్ ఫైనాన్సింగ్ పరిష్కారాలు

మేము కేవలం ప్రోడక్ట్‌లు అమ్మడం లేదు. రైతులు కోరుకున్న స్థాయి సామర్థ్యాన్ని సాధించడంలో సహాయపడే అనూకూలమైన ట్రాక్టర్ ఫైనాన్సింగ్ పరిష్కారాలను మేము అందిస్తున్నాము. రైతులకు రుణాలు ఇచ్చేటప్పుడు, జాన్ డియర్  ఫైనాన్షియల్ రైతు ఆదాయ వనరులు మరియు ఆర్థిక బలాన్ని, మొత్తం పొలం ఉత్పత్తి విలువతో పాటు పరిగణనలోకి తీసుకుంటుంది మరియు ట్రాక్టర్లు మరియు సంబంధిత పరికరాలపై 90% వరకు ఫైనాన్స్ అందించవచ్చు.

ట్రాక్టర్ లోన్ లోన్ EMI

ట్రాక్టర్ రుణాలకు అనువైన లోన్ ఎంపికలు

ట్రాక్టర్ లోన్ చెల్లించే కాలంలో సరళత రైతుకు భరించగలిగేలా చేస్తుంది. మేము 5 సంవత్సరాల కాలపరిమితి వరకు నిధులు సమకూరుస్తాము, ప్రణాళిక మరియు నగదు ప్రవాహ నిర్వహణ సౌలభ్యాన్ని అందిస్తాము.

మీ పంట చక్రానికి సరిపోయే ట్రాక్టర్ లోన్ చెల్లింపు

జాన్ డియర్  ఫైనాన్షియల్ వ్యవసాయం యొక్క చక్రీయ స్వభావాన్ని అర్థం చేసుకుంటుంది. మా ట్రాక్టర్ ఫైనాన్సింగ్ పరిష్కారాలు మీ పంట విధానం మరియు నగదు ప్రవాహం ఆధారంగా నెలవారీ, త్రైమాసిక లేదా అర్ధ-వార్షిక తిరిగి చెల్లింపులకు సపోర్ట్ చేస్తాయి. ఇది వ్యవసాయ పనులు సజావుగా అలాగే స్థిరంగా జరిగేలా చూస్తుంది.

టోల్-ఫ్రీ నంబర్- 18002091034
మాకు ఇమెయిల్ చేయండి

ట్రాక్టర్ ఫైనాన్సింగ్ గురించి తరచుగా అడిగే ప్రశ్నలు

ట్రాక్టర్ ఫైనాన్సింగ్ అంటే ఏమిటి?

ట్రాక్టర్ ఫైనాన్సింగ్ అనేది రైతులకు అనువైన తిరిగి చెల్లింపు ఎంపికలతో నిధులను అందించడం ద్వారా ట్రాక్టర్లను కొనుగోలు చేయడానికి సహాయపడే లోన్ ఉత్పత్తి.

జాన్ డియర్ ట్రాక్టర్ ఫైనాన్సింగ్ ద్వారా నేను ఎంత ఫైనాన్స్ పొందవచ్చు?

మీ అర్హతను బట్టి మీరు ట్రాక్టర్ ఖర్చులో 90% వరకు ఫైనాన్స్ పొందవచ్చు.

జాన్ డియర్ నుండి ట్రాక్టర్ లోన్ కోసం ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు?

స్థిరమైన ఆదాయం మరియు చెల్లుబాటు అయ్యే డాక్యుమెంటేషన్ ఉన్న రైతులు, వ్యవసాయ-వ్యాపార యజమానులు మరియు వాణిజ్య వ్యవసాయ నిర్వాహకులు దరఖాస్తు చేసుకోవచ్చు.

అందుబాటులో ఉన్న గరిష్ట లోన్ కాలపరిమితి ఎంత?

జాన్ డియర్  5 సంవత్సరాల వరకు లోన్ కాలపరిమితిని అందిస్తుంది, ఇది మీ సౌలభ్యం మేరకు తిరిగి చెల్లించడానికి వీలుగా ఉంటుంది.

ట్రాక్టర్ ఫైనాన్సింగ్‌లో EMIలు స్థిరంగా ఉన్నాయా లేదా సరళంగా ఉన్నాయా?

మేము నెలవారీ, త్రైమాసిక మరియు అర్ధ-వార్షిక తిరిగి చెల్లింపు ఎంపికలను అందిస్తున్నాము, మీ ఆదాయ చక్రానికి సరిపోయేలా అనుకూలీకరించాము.

నేను కొలేటరల్ లేకుండా ట్రాక్టర్ ఫైనాన్సింగ్ పొందవచ్చా?

కొలేటరల్ అవసరాలు మీ క్రెడిట్ ప్రొఫైల్ మరియు లోన్ మొత్తాన్ని బట్టి ఉంటాయి. చాలా సందర్భాలలో, ట్రాక్టర్ కూడా కొలేటరల్‌గా పనిచేస్తుంది.

ట్రాక్టర్ ఫైనాన్సింగ్ కోసం ఏ పత్రాలు అవసరం?

సాధారణంగా, KYC పత్రాలు, ఆదాయ రుజువు, భూమి యాజమాన్య రుజువు మరియు ట్రాక్టర్ కొటేషన్ అవసరం.

ట్రాక్టర్ లోన్ కి డౌన్ పేమెంట్ అవసరమా?

అవును, ఖర్చులో కొంత శాతాన్ని సాధారణంగా ముందుగానే చెల్లించాలి. మిగిలిన మొత్తాన్ని ఫైనాన్స్ పొందవచ్చు.

జాన్ డియర్ ట్రాక్టర్ లోన్ కోసం నేను ఎలా దరఖాస్తు చేసుకోవాలి?

మీరు సమీపంలోని జాన్ డియర్  డీలర్‌షిప్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు లేదా వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో ఎంక్వైరీ ప్రారంభించవచ్చు.

ఏవైనా ముందస్తు చెల్లింపు ఛార్జీలు ఉన్నాయా?

ముందస్తు చెల్లింపు సాధారణంగా అనుమతించబడుతుంది, కానీ ఛార్జీలు (ఏదైనా ఉంటే) లోన్ నిబంధనలపై ఆధారపడి ఉంటాయి. దయచేసి మీ డీలర్‌తో మాట్లాడండి.

వాడిన ట్రాక్టర్లకు నేను ఫైనాన్సింగ్ పొందవచ్చా?

ప్రస్తుతం, జాన్ డియర్  ప్రధానంగా కొత్త ట్రాక్టర్లకు ట్రాక్టర్ ఫైనాన్సింగ్‌ను అందిస్తుంది. వాడిన ట్రాక్టర్ల లభ్యత మారవచ్చు.

వడ్డీ రేటు ఎలా నిర్ణయించబడుతుంది?

వడ్డీ రేట్లు మీ క్రెడిట్ స్కోరు, తిరిగి చెల్లించే సామర్థ్యం మరియు ప్రస్తుత ఆర్థిక పరిస్థితులపై ఆధారపడి ఉంటాయి.

వాణిజ్య రైతులు ట్రాక్టర్ ఫైనాన్సింగ్‌ను పొందవచ్చా?

అవును, వ్యక్తిగత మరియు వాణిజ్య రైతులు ఇద్దరూ ట్రాక్టర్ లోన్ లకి అర్హులు.

నేను ట్రాక్టర్ లోన్ EMI మిస్ అయితే ఏమి జరుగుతుంది?

ఆలస్యమైన చెల్లింపులకి జరిమానాలు విధించవచ్చు మరియు మీ క్రెడిట్ ప్రొఫైల్‌ను ప్రభావితం చేయవచ్చు. సౌకర్యవంతమైన పరిష్కారాలను అన్వేషించడానికి ముందుగానే మాకు తెలియజేయమని మేము సలహా ఇస్తున్నాము.

ట్రాక్టర్ ఫైనాన్సింగ్ సపోర్ట్ కోసం నేను ఎవరిని సంప్రదించాలి?

మా టోల్-ఫ్రీ నంబర్: 18002091034 కు కాల్ చేయండి లేదా ప్రత్యక్ష సహాయం కోసం మాకు ఇమెయిల్ చేయండి ఎంపికను ఉపయోగించండి.