జాన్ డియర్ కూలెంట్

జాన్ డియర్ ట్రాక్టర్ భాగాలు, ట్రాక్టర్ కూలెంట్, రైట్ ప్రొఫైల్

మీ కూలింగ్ వ్యవస్థ కోసం సంవత్సరం పొడవునా అల్టిమేట్ రక్షణ. మీ ఇంజిన్‌ను చల్లగా ఉంచుతుంది మరియు ఇంజిన్ జీవితకాలాన్ని పెంచుతుంది

మీ మెషీన్‌కు జాన్ డియర్ కూలెంట్ ఏ విధంగా ఉత్తమమైనది?

ఇంజిన్ మీ పరికరాలలో ముఖ్యమైన భాగం. ఇది ’ ఖచ్చితంగా అవసరం, ఇది మీ పరికరాల విశ్వసనీయ మరియు సమర్థవంతమైన పనితీరు కోసం ఆశించిన జీవితకాలమంతా సమర్థవంతంగా పనిచేస్తుంది. ఇంధనాన్ని మండిచడం వల్ల శక్తి మరియు ఉష్ణం ఏర్పడుతుంది. ఈ ఉష్ణం ఇంజిన్ మరియు దాని భాగాలకు బదిలీ అవుతుంది. ఇంజిన్ లోపల అవసరమైన ఉష్ణోగ్రత ఉంచటానికి కూలింగ్ వ్యవస్థ ఉండటం అవసరం. ఈ కూలింగ్ వ్యవస్థ తీవ్రమైన ప్రెషర్మ రియు ఉష్ణోగ్రతల క్రింద సమర్థవంతంగా పనిచేయాలి.

జాన్ డియర్ పరికరాలు అధునాతన కూలింగ్ వ్యవస్థతో అమర్చబడి ఉంటాయి, ఇది ఇంజిన్ యొక్క గరిష్ట పనితీరు మరియు నిర్వహణ-రహిత సుదీర్ఘ జీవితకాలం కోసం ప్రత్యేకంగా రూపొందించిన కూలెంట్ ని ఉపయోగిస్తుంది. జాన్ డియర్ కూలెంట్ అనేది ప్రత్యేకంగా రూపొందించిన కూలెంట్, యాంటీ-కొరోషన్ అడిటివ్‌లు మరియు యాంటీ-ఫోమింగ్ ఏజెంట్‌ల మిశ్రమం. ఇది ఉపయోగించడానికి సిద్ధంగా ఉంటుంది, నిర్ణీత శాతం డీ-మినరలైజ్డ్ వాటర్‌తో ముందుగా కలిపి ఉంటుంది.

కూలెంట్

ఏ ఇంజన్ అయినా మెరుగ్గా, సమర్ధవంతంగా పనిచేయాడానికి కూలెంట్ కీలక పాత్ర పోషిస్తుంది. ఇది ఇంజన్ ఉష్ణోగ్రతను నియంత్రిస్తుంది, అధిక వేడిని నిరోధిస్తుంది మరియు తీవ్రమైన వేడి లేదా చలి వల్ల కలిగే తుప్పు మరియు నష్టం నుండి అంతర్గత భాగాలను రక్షిస్తుంది. అధిక నాణ్యత గల కూలెంట్ కూడా పాడవటాన్ని, నిర్వహణ అవసరాలను తగ్గించడానికి మరియు మొత్తం ఇంజన్ జీవితకాలం మరియు పనితీరును మెరుగుపరచడానికి సహాయపడుతుంది. వ్యవసాయ యంత్రాలు, పరికరాలు లేదా ట్రాక్టర్లలో, ఉపయోగించినా, సరైన కూలెంట్ వివిధ పని పరిస్థితులలో సజావుగా, అంతరాయం లేకుండా పనిచేయడానికి వీలుకల్పిస్తుంది. పరికరాల అప్ టైమ్ పెంచడానికి మరియు ఖరీదైన మరమ్మతులను తగ్గించడానికి నమ్మకమైన, బాగా రూపొందించబడిన కూలెంట్‌ను ఎంచుకోవడం చాలా అవసరం. ...