జాన్ డియర్ ఇండియా ఆపరేషన్స్ సెంటర్

జాన్ డియర్ ఆపరేషన్స్ సెంటర్ మా కస్టమర్లకు ఒక సమగ్ర పరిష్కారాన్ని అందిస్తుంది, పవర్ టెక్ ట్రాక్టర్ల కోసం JDLink™ టెక్నాలజీ ద్వారా వారి నిర్దిష్ట అవసరాలకు అనుగుణంగా పరికరాల పర్యవేక్షణ మరియు వ్యాపార నిర్వహణను అందిస్తుంది. మేము ఇప్పుడు ట్రెమ్ 3A ట్రాక్టర్ల కోసం గ్రీన్‌సిస్టమ్‌లింక్ టెక్నాలజీని ప్రవేశ పెడుతున్నాము, వినియోగదారులు తమ ట్రెమ్ 3A మెషీన్లతో జాన్ డియర్ ఆపరేషన్స్ సెంటర్ యాప్ ను ఉపయోగించడానికి వీలు కల్పిస్తుంది.

ఆపరేషన్ సెంటర్ మీకు ఇవి అందిస్తుంది:

  • మెషిన్ హెల్త్ అలర్ట్స్
  • మీ ట్రాక్టర్‌ను సులభంగా గుర్తించడం
  • సులభమైన ఫీల్డ్ వర్క్ డాక్యుమెంటేషన్
  • మీ ట్రాక్టర్ ని మానిటర్ చేయడం మరియు సంరక్షించడం
  • సులభమైన ఫ్లీట్ మేనేజ్‌మెంట్
  • మీ ట్రాక్టర్ కి రక్షణ
మెషిన్ హెల్త్ అలర్ట్స్

మెషిన్ హెల్త్ అలర్ట్స్

మెషిన్ భద్రతను అందిస్తుంది మరియు అంతరాయం లేకుండా పనిచేయడానికి కస్టమర్ కి వీలు కల్పిస్తుంది.

  • అధిక ఇంజన్ ఉష్ణోగ్రత
  • ఆయిల్ ప్రెషర్ లో అలర్ట్
  • ఫ్యూయల్ లో నీరు
  • ఎయిర్ క్లీనర్ చోక్డ్
  • బ్యాటరీ ఛార్జింగ్ సిస్టమ్ ఫాల్ట్

Note: పవర్‌టెక్ ట్రాక్టర్‌లకు మాత్రమే వర్తిస్తుంది

Machine track and trace

మెషిన్ ట్రాక్ అండ్ ట్రేస్ & ప్రొటెక్షన్

ప్రస్తుత స్థానం, పని పురోగతి మరియు రిమోట్‌గా వర్క్ ఆర్డర్‌లను మెరుగ్గా నిర్వహించడం ద్వారా పరికరాల వినియోగాన్ని మెరుగుపరుస్తుంది.

  • ట్రాక్ చేసి రియల్ టైమ్ కరెంట్ ఎక్విప్‌మెంట్ లొకేషన్ పొందండి
  • ట్రేస్ చేసి - ఆ రోజు ట్రాక్టర్ యొక్క కదలిక హిస్టరీ పొందండి
Field work documentation

ఫీల్డ్ వర్క్ డాక్యుమెంటేషన్

డిజిటైజ్డ్ వర్క్ డాక్యుమెంటేషన్ వివాదాలను నివారిస్తుంది! ఉత్పాదకత మరియు లాభదాయకతను ఆప్టిమైజ్ చేయడానికి ఫ్యూయల్ వినియోగం, ఇంజన్ పనితీరు వంటి  పని-నిర్దిష్ట పనితీరు డేటా.

ఫీల్డ్ వర్క్ పర్యవేక్షణ కింది సమాచారాన్ని అందిస్తుంది:

  • ఎకరాల్లో విస్తీర్ణం 
  • కవరేజీ
  • మొత్తం సమయం
  • ప్రారంభ మరియు ముగింపు సమయం
  • మొత్తం ఫ్యూయల్ వినియోగం లీటర్లు
East fleet management

ఈజీ ఫ్లీట్ మేనేజ్‌మెంట్

బహుళ ట్రాక్టర్లు ఉన్న రైతులకు అనువైనది
స్థానం, హెల్త్ మరియు స్థితితో కూడిన ఫ్లీట్ పర్యవేక్షణ

పరికరాల పనితీరు పర్యవేక్షణ

పరికరాల పనితీరు పర్యవేక్షణ

ఈ ఫీచర్ కీలక పరికరాల పనితీరు ప్రమాణాలపై అవగాహన కల్పిస్తుంది, పరికరాల ఉత్పాదకతను మెరుగుపరుస్తుంది మరియు పరికరాలు సరైన పరిస్థితులలో పనిచేసేలా చూస్తుంది. ప్రస్తుత నిర్వహణా నిబంధనలను అర్థం చేసుకోవడానికి ఆపరేషన్స్ సెంటర్ మొబైల్ యొక్క "Right Now" ట్యాబ్‌పై మీరు లైవ్ ఇంజిన్ RPM మరియు లోడ్‌ను పర్యవేక్షించవచ్చు. అదనంగా, ఆపరేషన్స్ సెంటర్ మొబైల్ యొక్క "Today" ట్యాబ్ రోజువారీ పరికర వాడకము సారాంశాన్ని అందిస్తుంది, ఇందులో వినియోగ గంటలు మరియు రోజుకు మొత్తంగా ఇంధన వినియోగం ఉంటాయి.  గరిష్టసీజన్ సమయంలో ట్రాక్టర్‌లో ఇంధనం అయిపోకుండా నివారించడానికి మీరు ఆన్‌లైన్‌లో ప్రస్తుత ఫ్యూయల్ లెవల్‌ని పర్యవేక్షించుకోవచ్చు.