
జాన్ డియర్ ట్రాక్టర్ శ్రేణిలో అత్యంత శక్తివంతమైన 5130M ట్రాక్టర్‌ను ప్రవేశపెట్టడం ద్వారా హైలైట్ అవుతూ, జాన్ డియర్ ఇండియా కొత్త ట్రాక్టర్ శ్రేణిని ప్రారంభించడంతో వ్యవసాయ ఆవిష్కరణకు నాయకత్వం వహించడానికి తోడ్పడుతుంది. ఆకట్టుకునే 130 HP ఇంజిన్‌తో, సాటిలేని ఉత్పాదకత, సామర్థ్యం మరియు సౌకర్యాన్ని అందిస్తూ, కఠినమైన వ్యవసాయ పరిస్థితులను నిర్వహించడానికి ఈ పవర్‌హౌస్ రూపొందించబడింది.
అత్యంత ఆసక్తిగా ఎదురుచూసిన పవర్ మరియు టెక్నాలజీ 6.0 ఈవెంట్‌లో జరిగిన ఈ ఆవిష్కరణ, వినూత్న వ్యవసాయ పరిష్కారాలతో భారతీయ రైతులకు సాధికారత కల్పించడంలో జాన్ డియర్ నిబద్ధతను ప్రదర్శించింది. 5130Mతో పాటు, జాన్ డియర్ వ్యవసాయ యంత్రాలలో ఒక అగ్రగామిగా దాని స్థానాన్ని బలోపేతం చేసుకుంటూ, లిఫ్టింగ్ సామర్థ్యం, ట్రాన్స్‌మిషన్ టెక్నాలజీ మరియు ప్రెసిషన్ ఫార్మింగ్లో అనేక పురోగతులను ప్రవేశపెట్టింది.
సాటిలేని పవర్ మరియుపనితీరు: 5130M
అధిక పవర్‌ను కలిగి ఉన్నప్పటికీ, జాన్ డియర్ 5130M ట్రాక్టర్ ఫ్యూయల్ సామర్ధ్యమును కలిగి ఉంది, తక్కువ నిర్వహణ ఖర్చులతో అధిక ఉత్పత్తిని కోరుకునే రైతులకు తక్కువ ఖర్చుతో కూడిన పరిష్కారాన్ని అందిస్తుంది. 3700 kgf లిఫ్ట్ సామర్థ్యము కలిగి ఉండి, ఈ ట్రాక్టర్ భారీ ఇంప్లిమెంట్లని సులభంగా లిఫ్ట్ చేయడానికి అనువైనది.
5130M ఇలాంటి భారీ-తరహా కార్యకలాపాల కోసం, అధిక-డిమాండ్ ఇంప్లిమెంట్లను సునాయాసంగా ఉపయోగించడానికిరూపొందించబడింది:
- 4 బాటమ్ రివర్సబుల్ MB ప్లో: మంచి గాలి ప్రసరణ మరియు కలుపు నియంత్రణ ఉండేలా, లోతుగా దున్నడానికి అనువైనది.
- పవర్ హారో & డిస్క్ హారో: సమర్థవంతమైన నారుమడి ఏర్పాటు చేయడానికి నేలని సిద్ధం చేయడంలో సహాయపడుతుంది.
- ఫోర్త్ జనరేషన్ లార్జ్ రౌండ్ బేలర్: పంటకోత అనంతర ప్రక్రియను సమర్ధవంతం చేస్తూ, త్వరితమైన మరియు సమర్ధవంతమైన బేలింగ్ (చుట్టలు చుట్టడం) జరిగేలా చూస్తుంది.
GearProTM టెక్నాలజీ: పని చేయడానికి తెలివైన మార్గం
జాన్ డియర్ దీని GearProTM టెక్నాలజీతో ట్రాక్టర్ సామర్థ్యాన్ని పున:నిర్వచిస్తూ, ఇప్పుడు జాన్ డియర్ 5042D ట్రాక్టర్ మోడల్‌ను ప్రవేశపెట్టింది. ఈ ఆధునిక ట్రాన్స్‌మిషన్ సిస్టమ్ రైతులకు వివిధ భూభాగాలు మరియు వాడకములపై ఉత్తమ నియంత్రణను ఇస్తూ 12 ఫార్వర్డ్ మరియు 4 రివర్స్ స్పీడ్‌లను అందిస్తుంది.
5042Dలో GearProTM టెక్నాలజీ కీలక ప్రయోజనాలు:
- మెరుగైన డ్రైవింగ్ సౌకర్యం కోసం స్మూత్ గేర్ షిఫ్టింగ్.
- ట్రాన్స్‌మిషన్ సిస్టమ్‌పై అరుగుదల మరియుపాడవడం తగ్గడం .
- విభిన్న పొలం పరిస్థితుల కోసం అనుకూలమైన స్పీడ్ సెట్టింగ్‌లు.
అదనంగా, పొడిగించిన 500-గంటల సర్వీస్ విరామంతో, రైతులు ఉత్పాదకతపై దృష్టి పెట్టడానికి సాధ్యపడేలా చేస్తూ, ఈ మోడల్ నిర్వహణ డౌన్‌టైమ్‌ను తగ్గిస్తుంది. జారకుండా ఉండే ఫ్లోర్‌మ్యాట్, మెరుగైన సీటు సౌకర్యం మరియు ఒక స్టైలిష్ స్టీరింగ్ వీల్‌తో సహా మెరుగైన ఎర్గోనామిక్ ఫీచర్‌లు వినియోగదారు అనుభవాన్ని మరింత మెరుగుపరుస్తాయి.
అధిక వెర్సటాలిటీ కోసంఅధిక లిఫ్టింగ్ సామర్ధ్యం
రైతులకు తరచుగా బలమైన లిఫ్టింగ్ పరిష్కారాలు అవసరం అవుతాయి, 5045D GearProTM మరియు 5050D GearProTM ట్రాక్టర్‌లను అప్‌గ్రేడ్ చేయడం ద్వారా పరిష్కారం అందించింది. భారీ లోడ్‌లను సమర్థవంతంగా నిర్వహించడానికి అనుమతించేలా, ఈ మోడల్స్ ఇప్పుడు ఆకట్టుకునేలా 1800 kgf లిఫ్టింగ్ సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి.
ఈ మెరుగుదల ఈ ట్రాక్టర్‌లను పెద్ద ఇంప్లిమెంట్లని తీసుకుని వెళ్లడం, భారీ లోడ్‌లను రవాణా చేయడం లేదా అనేక వ్యవసాయ పనులను సులభంగా నిర్వహించడం వంటివాటిలో మరింత వెర్సటైల్ గా చేస్తుంది.
PermaClutch టెక్నాలజీ: ధృఢత్వం సామర్థ్యం కలయిక
దీర్ఘకాలిక మన్నిక మరియు సులభమైన కార్యకలాపాలను నిర్ధారిస్తూ, జాన్ డియర్ తన PermaClutch టెక్నాలజీని 5310, 5405 మరియు 5075E తో సహా అదనపు మోడల్స్‌కు విస్తరించింది.
ఈ వెట్ క్లచ్ సిస్టమ్ వీటిని అందిస్తుంది:
- తక్కువగా అరిగిపోవడం మరియుపాడవడం , ట్రాక్టర్ జీవితకాలం పెరగడానికి కారణమవుతుంది.
- కఠినమైన పరిస్థితులలోనూ నిలకడైన పనితీరు.
- మొత్తం వ్యవసాయ సామర్థ్యాన్ని మెరుగుపరుస్తూ, తక్కువ నిర్వహణ ఖర్చులు.
రైతుల అవసరాలను మరింతగా తీర్చడానికి, మెరుగైన క్లచ్ పనితీరు కొరకు చూస్తున్న వారికి అదనపు ఎంపికలను అందిస్తూ, 5210 సిరీస్లో సింగిల్ క్లచ్ PermaClutch సిస్టమ్‌ను ప్రవేశపెడుతోంది.
ప్రెసిషన్ వ్యవసాయం కొరకు ఆధునిక ఇంప్లిమెంట్లు
జాన్ డియర్ ట్రాక్టర్ టెక్నాలజీని అభివృద్ధి చేయడమే కాకుండా దిగుబడులు మరియు సామర్థ్యాన్ని అనువుగా చేయడానికి వ్యవసాయ ఇంప్లిమెంట్లను కూడా మెరుగుపరుస్తుంది.
ప్రెసిషన్ వ్యవసాయంలో కొత్త ఆవిష్కరణలు:
- ప్రెసిషన్ ఆటోమేటిక్ పొటాటో ప్లాంటర్: మెరుగైన పంట దిగుబడుల కొరకు విత్తనం ఖచ్ఛితంగా వేసేలా చూస్తుంది.
- GreenSystem కాంప్యాక్ట్ రౌండ్ బేలర్స్: సామర్థ్యాన్ని పెంచడానికి మరియు డౌన్‌టైమ్‌ను తగ్గించడానికి ఇప్పుడు ఎలక్ట్రో-మెకానికల్ ఆటో ట్విన్ డిస్పెన్సర్‌ను కలిగి ఉంది.
- ప్రెసిషన్ ఫెర్టిలైజర్ మీటరింగ్ సొల్యూషన్: మెరుగైన నేల సారం మరియు అధిక ఉత్పత్తి కొరకు ఖచ్ఛితమైన ఎరువుల పంపిణీని అందిస్తూ, మునుపటి హై-స్పీడ్ ప్రెసిషన్ ప్లాంటర్ యొక్క అప్‌గ్రేడ్ వెర్షన్.
స్మార్ట్ కనెక్టివిటీ: వ్యవసాయ భవిష్యత్తు
GreenSystemTM Link మరియు JDLinkTM సహా, దీని స్మార్ట్ కనెక్టివిటీ సొల్యూషన్స్‌తో జాన్ డియర్ సాంప్రదాయ వ్యవసాయం మరియు స్మార్ట్ టెక్నాలజీ మధ్య అంతరాన్నితగ్గిస్తుంది . ఈ పరికరాలు వ్యవసాయ పనులలోకి రియల్-టైమ్ ఇన్‌సైట్స్ అందిస్తాయి, రైతులకు వీటిని అనుమతిస్తాయి:
- మొబైల్ డివైజ్‌ల ద్వారా వారి ట్రాక్టర్‌లను దూరం నుండి పర్యవేక్షించుకోవడం.
- ఫ్యూయల్ వినియోగం మరియు కార్యాచరణ సామర్థ్యాన్ని ట్రాక్ చేయడం.
- బ్రేక్‌డౌన్‌లను నివారించడానికి ప్రిడిక్టివ్ మెయింటెనెన్స్ అలర్ట్‌లను అందుకోవడం.
ఈ పురోగతులు రైతులకు అనవసరమైన పని సమయాన్ని తగ్గించేటప్పుడు వారి కార్యకలాపాలను సమర్థవంతంగా నిర్వహించడానికి సులభతరం చేస్తుంది.
CleanPro FIK: నిర్వహణను తగ్గించడం, జీవితకాలాన్ని పెంచడం
ట్రాక్టర్ పనితీరును మెరుగుపరచడానికి రూపొందించిన వినూత్నమైన సిస్టమ్ CleanProTM FIK టెక్నాలజీని కూడా జాన్ డియర్ ప్రవేశపెడుతుంది. CleanProTM రివర్సిబుల్ ఫ్యాన్ ఇంజిన్ కూలింగ్‌ను మెరుగుపరుస్తూ, వీటికి కారణమవుతుంది:
- తగ్గిన నిర్వహణ ఖర్చులు.
- పెరిగిన ఇంజన్ జీవితకాలం.
- మెరుగైన ఫ్యూయల్ సామర్థ్యం.
పరికరాల మన్నికను మెరుగుపరచాలనుకునే రైతుల కోసం దీనిని ఒక విలువైన అప్‌గ్రేడ్‌గా చేస్తూ, ఈ ఫీచర్ జాన్ డియర్ PowerTechTM ట్రాక్టర్‌ల కొరకు అందుబాటులో ఉంది.
Anubhuti యాప్: జెన్యూన్ పార్ట్స్ ధృవీకరించుకోడాన్ని సులభతరం చేసింది
ట్రాక్టర్ జీవితకాలం మరియు పనితీరును ధృవీకరించడానికి, జాన్ డియర్ ఒక కొత్త హై సెక్యూరిటీ స్మార్ట్ లేబుల్ స్కానర్‌ను Anubhuti యాప్‌లో పొందుపరిచింది. రైతులు ఇప్పుడు వాటి ప్రామాణికతను ధృవీకరించడానికి పార్ట్‌లపై ఉన్న లేబుల్స్‌ను స్కాన్ చేసుకోవచ్చు, ట్రాక్టర్ సామర్థ్యంతో రాజీపడే నకిలీ భాగాల వాడకాన్ని నిరోధించవచ్చు.
ఇది ఎందుకు ముఖ్యమైనది?
- నాసిరకం విడిభాగాల నుంచి ట్రాక్టర్లను సంరక్షిస్తుంది.
- మన్నిక మరియు మొత్తం మెషిన్ పనితీరును మెరుగుపరుస్తుంది.
- నిజమైన జాన్ డియర్ ఉత్పత్తులపై పెట్టుబడి చేసే రైతులకు ఆందోళన లేకుండా మనశ్శాంతిని అందిస్తుంది.
జాన్ డియర్: భారతీయ వ్యవసాయ రంగంలో కొత్త శకానికి నాంది
5130M లాంచ్ మరియు అత్యాధునిక ఆవిష్కరణల సిరీస్‌తో, జాన్ డియర్ భారతదేశంలో వ్యవసాయ విధానాన్ని మెరుగుపరచడాన్ని కొనసాగిస్తుంది. అధిక పవర్ కలిగిన ట్రాక్టర్‌లు మరియు ఆధునిక ట్రాన్స్‌మిషన్ టెక్నాలజీ నుండి స్మార్ట్ ఫార్మింగ్ పరిష్కారాల వరకు, ఈ ఆవిష్కరణలు ఉత్పాదకతను పెంచడానికి, నిర్వహణ ఖర్చులను తగ్గించడానికి మరియు సుస్థిరతను ప్రోత్సహించడానికి రూపొందించబడ్డాయి.
వ్యవసాయం అభివృద్ధి చెందుతున్న కొద్దీ, జాన్ డియర్ రైతులకు ఉత్తమమైన సాధనాలు, సాంకేతిక పరిజ్ఞానం మరియు మద్దతును అందించడానికి కట్టుబడి ఉంది, ఇది వ్యవసాయం ఉత్పాదకంగా మాత్రమే కాకుండా భవిష్యత్తులో లాభదాయకమైన రాబడి వచ్చేలా చూస్తుంది.